ఎన్నారైల సంక్షేమం, భద్రత కోసం ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం రూపొందించిన **‘ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం’**ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్‌లో ఘనంగా ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు లబ్ధి పొందవచ్చు. బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా, ₹10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
ప్రవాసాంధ్రులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు.

