RRR అలైన్‌మెంట్ మార్పు భయంతో వృద్ధురాలి మృతి

RRR అలైన్‌మెంట్ మార్పు భయంతో వృద్ధురాలి మృతి – రేవంత్ ప్రభుత్వం పై ప్రజల్లో ఆగ్రహం

వికారాబాద్:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన RRR (రాజీవ్ రహదారి రింగ్‌రోడ్) అలైన్‌మెంట్ మార్పు మరో కుటుంబాన్ని కుదిపేసింది. భూమి పోతుందనే భయంతో ఓ వృద్ధురాలు గుండెపోటుకు గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే — వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన అంజయ్య, అంజమ్మ దంపతులు 132 సర్వే నంబరులోని తమ రెండెకరాల భూమిపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం RRR ప్రాజెక్ట్‌లో అలైన్‌మెంట్ మార్పులు చేపట్టడంతో, వారి భూమి కూడా సర్వేలోకి చేరింది.

భూమి పోతుందనే ఆందోళనతో గత రెండు నెలలుగా తీవ్ర మనోవేదనలో ఉన్న అంజయ్య, అంజమ్మ దంపతులు చివరికి ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అంజమ్మ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

గ్రామస్థులు మాట్లాడుతూ — “అమాయక ప్రజల కష్టాలు, బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ అలైన్‌మెంట్ మార్పులు మాకు నాశనం తెస్తున్నాయి” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఈ ఘటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొంటూ, రైతుల ఆందోళనలను వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *