Red Fort Bomber Selfie Viral Video

ఢిల్లీ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. చాందినీ చౌక్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడుకు బాధ్యుడైన ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌.. ఆ దాడికి ముందు చేసిన సెల్ఫ్ వీడియోను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు.

ఆత్మాహుతి దాడిపై సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని డాక్టర్ ఉమర్‌ వీడియోలో స్పష్టం చేశాడు. సుసైడ్‌ బాంబింగ్‌ చేయాలంటే ఆ వ్యక్తి అత్యంత భయంకరమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని, మరణమే తన అంతిమ లక్ష్యంగా భావించాల్సి ఉంటుందని చెప్పాడు.

సుసైడ్‌ దాడిని ప్రజాస్వామ్య సమాజం… ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని అన్నాడు. కానీ ఇస్లాంలో మాత్రం ఆత్మాహుతి దాడిని బలిదాన ఆపరేషన్‌గా చూస్తారని వీడియోలో తెలిపాడు. మరణానికి భయపడవద్దనే భావనను కూడా వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటోంది.. ఇది అమరులయ్యే ఆపరేషన్ అని ఉమర్‌ వీడియోలో స్పష్టం చేశాడు.

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక మలుపు
సెల్ఫ్-రికార్డెడ్ వీడియోలో వాదనలు వెల్లడించిన ఉగ్రవాది: డాక్టర్ ఉమర్
ఆత్మాహుతి దాడి ముందు సమాజంలోని భిన్న అభిప్రాయాలను వివరించిన ఉమర్
సుసైడ్ బాంబ్ కి అత్యంత భయంకరమైన మైండ్‌సెట్ అవసరం: ఉమర్
మరణమే నా అంతిమ లక్ష్యంతో ముందుకు వెళ్లానన్న ఉమర్
ప్రజాస్వామ్య సమాజం సుసైడ్ దాడిని అంగీకరించదు అని స్పష్టం
ఇస్లాంలో ఆత్మాహుతి దాడి బలిదాన ఆపరేషన్‌ గా భావిస్తారు
వీడియోను సాంకేతికంగా విశ్లేషిస్తున్న పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *