బిల్లుల ప్రాబ్లమ్స్ – రేవంత్ శాశ్వత పరిష్కారం చూడాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బిల్లుల సమస్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు, ఆస్పత్రులకు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా స్పందించారు. సమ్మెకు దిగిన కాలేజీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసి, వారిని తిరిగి దారికి తెచ్చిన రేవంత్ ఇప్పుడు రాజకీయంగా బలమైన సంకేతాలు ఇస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తమపై కుట్రలు చేస్తే ఎదురుదాడికి సిద్ధమని ఆయన చెప్పడంతో ప్రతిపక్షం…

Read More

కట్టు బొట్టు మార్చిన కవిత…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ పయనాన్ని కొత్త కోణంలో ప్రారంభించారు.ఇటీవల ఆమె కనిపిస్తున్న కట్టు, బొట్టు, ఆహార్యం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా సమక్షంలో ఆమె కొత్త లుక్, కొత్త భాషణ శైలి చూస్తుంటే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ‘అమ్మ’గా పేరుగాంచిన జయలలితను తలపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మార్పు కేవలం సౌందర్య పరమైనదేనా?లేక జయలలిత తరహాలో బలమైన మహిళా నాయకురాలిగా ఎదగాలన్న వ్యూహాత్మక…

Read More

జూబ్లీహిల్స్ గెలుపు కోసం సీతక్క

ఒకవైపు కీలకమైన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావు నగర్ వంటి పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల మధ్య కలిసిపోతూ, టీ దుకాణంలో దోసెలు వేయడం, ఓ గృహిణి ఇంట్లో బియ్యం చెరగడం వంటి దృశ్యాలు ఆమె వినయాన్ని, ప్రజలతో సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పగలు ఇంటింటి ప్రచారం,…

Read More