బండి సంజయ్ అవుట్… కిషన్ రెడ్డి ఇన్! జూబ్లిహిల్స్‌లో బీజేపీ కొత్త వ్యూహం
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. పార్టీ తరపున మొదట లీడ్ తీసుకున్న బండి సంజయ్ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. బండి సంజయ్ మాత్రం ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. మొదట్లో మజ్లిస్, కాంగ్రెస్‌లపై తనదైన ధాటితో బండి సంజయ్ దాడి చేయడంతో బీజేపీకి ఊపొచ్చిందని అనిపించింది. కానీ అదే ధోరణి బీజేపీ హైకమాండ్‌కు నచ్చలేదని సమాచారం. ఆయన దూకుడు తగ్గించాలని,…

