తెలంగాణ మేధావులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశాలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రాష్ట్ర మేధావులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే “జాగృతి జనంబాట” కార్యక్రమానికి ముందుగా మేధావులను కలిసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు తదితర విషయాలపై చర్చించారు. తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా…

