తెలంగాణలో పెరిగిన చలి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూ,లో బుధవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో సగటున…

