తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను!

తెలుగు రాష్ట్రాలకు ప్రతిపక్షాలు కావలెను! “నిజమైన ప్రతిపక్షం ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే ఒక జాగృత శక్తి ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం, మెజారిటీ వచ్చిన వారు పాలించడం మాత్రమే కాదు. అధికార పక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పుడు కళ్ళెం వేసే ప్రతిపక్షం ఉండటం ఆ వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. కానీ, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అనే సంకుచిత అర్థానికి పరిమితమైపోయింది….

Read More

అదిత్య-L1 డేటా విశ్లేషణకు శాస్త్రవేత్తలకు ISRO ఆహ్వానం.

భారతదేశ తొలి సౌర పరిశోధనా మిషన్ అదిత్య-L1 రెండో వార్షికోత్సవం సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊపునిచ్చే కీలక ప్రకటన చేసింది ఇస్రో. అదిత్య-L1 మిషన్ ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ కోసం భారతీయ శాస్త్రవేత్తల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ (AO) విడుదల చేసింది.ప్రస్తుతం అదిత్య-L1 మిషన్‌కు సంబంధించి 23 టెరాబైట్లకు పైగా డేటా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని, ఇప్పటికే అనేక కీలక శాస్త్రీయ ఫలితాలు అంతర్జాతీయ పియర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని…

Read More

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలా..?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. జనవరి నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు పూర్తయ్యాక తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే…

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం?..

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల…

Read More

మందుబాబులూ జాగ్రత్త… సజ్జనార్ దగ్గర రికమండేషన్లు పనికిరావు!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు….

Read More

మాధవీలతపై కేసు..

సాయిబాబాపై అనుచిత కామెంట్స్ చేశారంటూ నటి మాధవీలతపై HYD సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సాయిబాబాపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సాయిబాబా అఫ్గాన్ ముస్లిమని, ఆయనను పూజించేవారికి బుద్ధిలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Read More

అమెరికాను వణికిస్తున్న ‘డెవిన్’ మంచు తుపాను

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ అనంతరం విరుచుకుపడిన ఈ తుపాను కారణంగా 1,800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి, వేలాది సర్వీసులు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. JFK, లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రయాణం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read More

ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్‌

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read More

స్థానిక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కొత్త రచ్చ..

తెలంగాణ కాంగ్రెస్‌ లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన.. వెలమ సామాజిక వర్గానికి ఈ…

Read More

కేటీఆర్–జగన్ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు గేమ్ ఏమిటి?

రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో…

Read More