రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ అనుమానాస్పద స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, రూం బయట ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు.
గన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన నేపథ్యంలో, పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు పోలీసులు గట్టిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు.
“రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే అక్కడున్న ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేది. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది,” అని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
రియాజ్ గతంలోనూ పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్నట్లుగా సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

