కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ ఘటనపై అధికారులు సమాచారం అందించారు. వెంటనే సీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం, ఉన్నత స్థాయి యంత్రాంగం తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం, బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

– E6TV న్యూస్

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *