Breaking News

గీత దాటితే కటకటాలే

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి…

Read More

రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా,…

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం?..

సంక్రాంతి రద్దీ దృష్ట్యా టోల్ రుసుము మినహాయింపునకు యోచన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల…

Read More

వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు

కోటి ఏకాదశులకు సమానమైనది వైకుంఠ ఏకాదశి. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐 తిరుమల సమాచారం 🚩 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం . 🚩 లక్కీ డిప్ లో సెలెక్ట్ అయి, టోకెన్ ఉన్న భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతి. 🚩 రెండంచెల తనిఖీనీ (Double checking) పాటిస్తున్న టీటీడీ. 🚩 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,631 🚩 18,609…

Read More

పీపీపీ (PPP) మోడల్ ఒక రక్షణ కవచం

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వైద్యులను తయారు చేస్తున్న దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 నుండి 80,000 మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకు వస్తుంటే, వారిలో దాదాపు 10,000 మంది వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు తరలిపోతున్నారు. మరోవైపు, దేశంలో సీట్లు దొరకక అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోసమే వేలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ పరిణామం అటు దేశ ఆరోగ్య వ్యవస్థను,…

Read More

అమెరికాను వణికిస్తున్న ‘డెవిన్’ మంచు తుపాను

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ అనంతరం విరుచుకుపడిన ఈ తుపాను కారణంగా 1,800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి, వేలాది సర్వీసులు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. JFK, లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రయాణం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read More

ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్‌

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read More

ఏపీలో హృదయవిదారక ఘటన

ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…

Read More