నెల్లూరు జిల్లా – వారసత్వ భూమిపై వివాదం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య తన కుటుంబానికి చెందిన వారసత్వ భూమిపై ఇతరులు ఆక్రమణ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి పేరున సర్వే నంబర్ 102/2లో 2.50 సెంట్ల భూమి ఉందని, తల్లిదండ్రుల మరణానంతరం అది వారసులైన తమకే చెందాలని తెలిపారు.

అయితే గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మ తమ పొలంపై హక్కులు ఉన్నట్లుగా చూపుతూ, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దొంగతనంగా తయారు చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో వాలంటీర్ సహాయంతో తమ కుటుంబ డేటాను దుర్వినియోగం చేశారని మస్తానయ్య తెలిపారు.

ఈ నేపథ్యంలో తమ హక్కులను కాపాడాలని, నకిలీ పత్రాలతో భూమి ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, మస్తానయ్య ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, ఏపీ సెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబులకు అర్జీ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *