మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలు, వరదల ముప్పు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటనకు బయలుదేరారు.
హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం చంద్రబాబు —
బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాలపై విస్తృతంగా పరిశీలన చేయనున్నారు.
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ అనంతరం,
కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవుతారు.

తదుపరి అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి, వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, దెబ్బతిన్న గ్రామాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
ప్రభావిత రైతులతో, స్థానిక ప్రజలతో మాట్లాడి, నష్టపరిహార చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడమే కాకుండా, అవసరమైన సాయం తక్షణం అందించేందుకు చర్యలు చేపట్టనుంది.

