Ap Liquor Scam

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను డిసెంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు… రిమాండ్ కొనసాగించాలని వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో నిందితుల తరపు న్యాయవాదులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్‌ ప్రకారం రిమాండ్‌ను పొడిగిస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. నిందితులు ఇప్పటికే 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలయినా… దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిట్ చెబుతుండటం సరికాదని వాదించారు.విడతలవారీగా ఛార్జ్‌షీట్‌లు వేస్తూ… ఇంత సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగితే కేసు కొట్టేయాలనే హక్కు తమకు ఉంటుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై స్పష్టమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాదులు వాదించారు.

రిమాండ్ పొడిగింపుకు సంబంధించిన న్యాయపరమైన సెక్షన్ ఏమిటో వివరించాలని… మేజిస్ట్రేట్ ప్రాసిక్యూషన్‌ను కోరగా, వారు సమయం అడిగినందున విచారణను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
తర్వాత మళ్లీ ప్రారంభమైన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి… చివరికి నిందితుల రిమాండ్‌ను డిసెంబర్ 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *