“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!”
దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి
కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో 37.2% మంది అప్పు భారాన్ని మోస్తున్నారు దీతో ఏపీ మొదటి స్థానంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచాయి అంటే ప్రతి 10 కుటుంబాల్లో కనీసం 4 కుటుంబాలు అప్పులలో ఉన్నట్టే

అయితే మరోవైపు ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలతో అనుసంధానం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది ఏపీలో 15 సంవత్సరాలు పైబడిన వారిలో 92.3% మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కర్ణాటక ఈ విషయంలో 95.9% తో మొదటి స్థానంలో నిలిచింది కానీ తెలంగాణ మాత్రం 14వ స్థానం లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది
రాజ్యాలు ప్రజలను బ్యాంకులతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక అవగాహన పెంచగలవు రిజర్వ్ బ్యాంక్ కూడా 15 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలని సూచించింది ఆసక్తికరంగా ఈశాన్య రాష్ట్రాలు ఈ విషయంలో దక్షిణాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఈశాన్య రాష్ట్రాల్లో 80% మంది ప్రజలు కవరయ్యారు కానీ అప్పులు మాత్రం కేవలం 7.4% మందికే ఉన్నాయి దీతో అప్పుల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా బాగున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి
మతాల ప్రాతిపదికన చూస్తే కూడా గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి హిందువులలో 88.1% మంది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నారు ముస్లింలలో ఈ సంఖ్య 80.8% మాత్రమే పురుషులకంటే మహిళలు బ్యాంకింగ్ పొదుపు కార్యకలాపాల్లో వెనుకబడ్డారు పురుషులు 89.8% మహిళలు 84.5% మాత్రమే
ఇంకో ఆసక్తికర అంశం కుటుంబ సభ్యుల సంఖ్యతో అప్పుల సంబంధం ఉంది పెద్ద కుటుంబాల్లో అప్పు తక్కువగా ఉండగా చిన్న కుటుంబాలు ఎక్కువగా అప్పుల్లో చిక్కుకున్నాయి
ఇది కేవలం గణాంకాల కథ కాదు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వాస్తవ చిత్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నామని చెప్పుకునే రాష్ట్రాలు అప్పుల భారంతో తడబడుతుండటం ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే
“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్ ఇది ఎవరి ఘనత”
📰 E6TV – ప్రత్యేక కథనం

