
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు సూచించారు. పబ్లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది.
మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో వాహనాలకు నో ఎంట్రీ విధించారు.
అలాగే పలు ఫ్లైఓవర్లు మూసివేయడంతో పాటు భారీ వాహనాలపై రాత్రి వేళల్లో బ్యాన్ అమలు చేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

