News
పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసన
మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? – కేంద్రమంత్రి పెమ్మసానికి రైతు కుటుంబ సభ్యుల నిరసనమందడం గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన సెగ తగిలించారు.మంత్రి నారాయణ సమక్షంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాన్ని రైతు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.“మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు?”…
దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం: కురసాల కన్నబాబు ఆరోపణలు
అమరావతి:చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అడ్డగోలు ఎదురుదాడులకు దిగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఊరూరా, వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం ఊపిరి సలపనట్టుగా మారిందని ఆయన అన్నారు.ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చంద్రబాబు ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని, దీనికి నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలేనని కన్నబాబు పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్…
నాడు రాజకీయ శిక్షణ కేంద్రం… నేడు విలువల విద్యకు చిరునామా గండిపేట
Chandrabau appriates StudentsTeachers
పీపీపీ (PPP) మోడల్ ఒక రక్షణ కవచం
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వైద్యులను తయారు చేస్తున్న దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఆ ప్రతిభ దేశానికి ఉపయోగపడటం లేదు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 నుండి 80,000 మంది ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకు వస్తుంటే, వారిలో దాదాపు 10,000 మంది వైద్యులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు తరలిపోతున్నారు. మరోవైపు, దేశంలో సీట్లు దొరకక అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోసమే వేలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ పరిణామం అటు దేశ ఆరోగ్య వ్యవస్థను,…
అమెరికాను వణికిస్తున్న ‘డెవిన్’ మంచు తుపాను
అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ అనంతరం విరుచుకుపడిన ఈ తుపాను కారణంగా 1,800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి, వేలాది సర్వీసులు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. JFK, లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రయాణం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన దువ్వాడ, ఈ కుట్ర వెనుక వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని అన్నారు. హత్య కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కీవ్‌పై రష్యా భారీ దాడి
కీవ్‌పై రష్యా భారీ దాడి ‘షెల్టర్లలోనే ఉండండి’ – మేయర్ హెచ్చరిక యుక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం రాత్రి రష్యా చేపట్టిన భారీ దాడితో దద్దరిల్లింది. నగరంలో పలు చోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీవ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సంచరిస్తున్నట్టు యుక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో టెలిగ్రామ్‌లో స్పందిస్తూ “రాజధానిలో పేలుళ్లు జరుగుతున్నాయి….
ఏపీలో హృదయవిదారక ఘటన
ఏపీలో హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపుమన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా, ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేట్ వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై…
డీకే త్యాగం వెనుక సీక్రెట్ ప్లాన్ బయటకు!
సీఎం పదవి అంశంపై కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన వేళ అక్కడి రాజకీయాలు వేడేక్కాయి. సీఎం మార్పు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తర్వాత ఏమైంది..? అధిష్టానం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అయ్యింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2023 ఎన్నికల ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ముగియడంతో సీఎం పీఠం మారుతుందని,…
కేటీఆర్–జగన్ సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు గేమ్ ఏమిటి?
రాజకీయ రంగంలో రాజకీయ ప్రముఖులు కలవడం సహజమే. కానీ కొంతమంది కలయిక మాత్రం రాజకీయాలను షేక్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ భేటీ అలాంటి పరిస్థితులనే తలపిస్తోంది. ఇంతకీ వీరి భేటీ దేనికి సంకేతం..? భేటీలో ఏ మాట్లాడుకున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్నేళ్లు ముందు వరకు వైయస్ జగన్, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించారు. అధికారం, మందీ మార్భలంలో…

