News
దళితులపై వేధింపులు: బిఆర్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ!
దళిత వర్గాలను అవమానిస్తున్నారంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల దళిత వ్యతిరేక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాత బస్టాండ్ సెంటర్ లోని సంజీవరెడ్డి భవన్ (డిసిసి కార్యాలయం) నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు 1,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు జెండాలు చేతబూని, రెండు…
తన పేషీకి ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్!
సీఎం ఆర్‌ఎఫ్ (CM Relief Fund) లంచం కేసులో ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో తన పేషీకి ఎలాంటి సంబంధమూ లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ దొరికిన ఆ నిందితులు తమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేయడం లేదని ఆయన తెలిపారు. ఒక పత్రికలో వచ్చిన వార్తపై మంత్రి ఓఎస్‌డీ (OSD) పులి సైదులు…
తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు
తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలినిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…
యూట్యూబర్ రమానందనపై మరో కేసు..
లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 10.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వహకురాలు రమానందనకు ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మోసం కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కోడలికి లండన్‌లో ఉద్యోగం…
విదేశీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ భారీ ఉపశమనం.. రూ.180 కోట్ల స్కాలర్‌షిప్…
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ.179.9 కోట్లను కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంతో విదేశాల్లో చదువుకుంటున్న 3,008 మంది విద్యార్థులకు ఆర్థిక ఊరట లభించనుంది. విడుదలైన నిధుల వివరాలు మరియు లబ్ధిదారుల సంఖ్యను కింద చూడవచ్చు:…
ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్
తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది….
భీంగల్ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు
బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…
బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
లారీ డ్రైవర్‌పై కేసు నమోదు బోధన్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని (TS16UB3690) అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా, వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు…
సోమూర్‌లో ఘనంగా ఎడ్ల అమావాస్య వేడుకలు
ఎద్దులను అలంకరించి పూజలు నిర్వహించిన కాశినాథ్ పటేల్ కుటుంబం మద్నూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) మండలంలోని సోమూర్ గ్రామంలో ఎడ్ల అమావాస్య (పొలాల పండుగ)ను కాశినాథ్ పటేల్ కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచే ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, తోరణాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులకు ఆరోగ్యం, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలు చేశారు. వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం కలిగిన…
నేడే జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టుల్లో శనివారం (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత తెలిపారు.జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్…

