
తిరుపతిలోని టిటిడి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది.
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి చొరబడాడు.విజిలెన్స్ సిబ్బంది గమనించేలోపే ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి,
మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురాన్ని ఎక్కాడు.గోపురం పైకి చేరుకున్న అతడు కలశాలను లాగేందుకు ప్రయత్నించడంతో భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.ఆ వ్యక్తిని **తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ, పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతి (45)**గా పోలీసులు గుర్తించారు.
తిరుపతిలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తుండగా, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్టు సమాచారం.గోపురం పై నుంచి అతడిని కిందికి దించేందుకు ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించారు. ఈ సందర్భంగా
“క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతాను” అంటూ షరతులు విధించినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని కుత్తడి తిరుపతి స్వయంగా అంగీకరించాడు.మద్యం మత్తులో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని,
విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని
ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.

