Breaking News

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!

జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…

Read More

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. వికసిత్ భారత్-జీ రామ్ జీ (VB-G RAM G) పనుల విస్తరణపై వినతి!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఎల్ నినో (El Nino) ప్రభావం మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల రైతులకు, కూలీలకు చేయూతనిచ్చేందుకు వికసిత్ భారత్-జీ రామ్ జీ (VB-G RAM G) ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని సీఎం కోరారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, భూముల ఉత్పాదకతను పెంచడం మరియు ప్రకృతి…

Read More

నీట్ ఆందోళనకారుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ నిరసనలకు సంబంధించి నమోదైన కేసుల్లో భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక ఇంటీరియం ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు వయస్సు ఉండి, ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని విద్యార్థి ఆందోళనకారులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన ఆదేశాలు & పరిశీలనలు స్వతంత్ర దర్యాప్తునకు కసరత్తు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో…

Read More

కోతుల బెడదకు చెక్ పెట్టిన యువకుడు

చింపాంజీ వేషంతో పంటలు, ఇళ్లను కాపాడుతున్న బాలాజీ నిర్మల్, జూలై 28: E6 tv NEWS(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చింపాంజీ వేషం ధరించి కోతులను తరిమేస్తూ రైతులకు, గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉండటంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు….

Read More

నిజామాబాద్ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి ఇందల్వాయి, జానకంపేట ఆర్‌ఓబీల మంజూరుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు న్యూఢిల్లీ/నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న,…

Read More

టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి,లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, జూలై 28: (E6 tv NEWS) రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్…

Read More

రష్యాలో వ్యవసాయ భూముల పేరుతో రూ. 1.10 కోట్ల మోసం.. మర్చంట్ నేవీ సీమన్‌కు సైబర్ నేరగాళ్ల గాలం!

హైదరాబాద్: రష్యాలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి అధిక లాభాలు అందిస్తామంటూ సైబరాబాద్ వ్యాప్తంగా కొత్త రకం మోసానికి తెరతీశారు కేటుగాళ్లు. ఈ క్రమంలో రష్యన్ ఫెడరేషన్‌లో వ్యవసాయ భూమి యాజమాన్య హక్కులు, అధిక రాబడి ఇప్పిస్తామని నమ్మించి నల్లాగండ్లకు చెందిన 46 ఏళ్ల మర్చంట్ నేవీ సీమన్ నుంచి రూ. 1.10 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తరఫున ఆయన న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు…

Read More

భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ…

Read More

తిర్మాన్‌పల్లి మైనారిటీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS (శివ ఠాకూర్). అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను…

Read More