Hyderabad
మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ
గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భజన మందిరం రోడ్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను పంపిణీ చేశారు. భారీ పరిశ్రమల కారణంగా పాల్వంచ ప్రాంతంలో పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పర్యావరణహిత గణపతి…
విచారణా..? కంటితుడుపు చర్యా..?
బాధితుల వాంగ్మూలాలు తీసుకోకుండానే విచారణ పూర్తి చేస్తారా? పై హోదాలో ఉన్న అధికారిపై కింది స్థాయి అధికారి విచారణ ఎలా? గత నివేదికల్లో వైరుధ్యాలున్నాయంటున్న ఫిర్యాదుదారులు కొత్తగూడెం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖలో చేపట్టిన తాజా విచారణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చిన ఎస్‌ఈ స్థాయి అధికారి కొత్తగూడెం డీఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. అయితే గతంలో…
CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం…
సిల్క్ సిటీ… గ్రీన్ సిటీగా మారాలి
కాలుష్యరహిత ధర్మవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: పరిటాల శ్రీరామ్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ధర్మవరం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణం సిల్క్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత పట్టణంగా అభివృద్ధి చెందాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో…
కొత్త ఓటర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
మద్నూర్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుంచి కొత్త ఓటరు నమోదు దరఖాస్తులతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నాలుగు విడతలుగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు బీఎల్వోలు…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
నిజాం-రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి: కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం…
రైతన్న కంట కన్నీరు.. బత్తలపల్లిలో కరువు కష్టాలు
అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వేల ఎకరాల ఉద్యాన పంటలు కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ బత్తలపల్లి, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతులు తీవ్ర…
తెలుగు రాష్ట్రాల్లో 93 కేసులు.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
తెలంగాణలోనే 87 కేసులు.. నంద్యాల పోలీసులకు చిక్కిన కళ్యాణదుర్గం వాసి నంద్యాల, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన శివను నిందితుడిగా గుర్తించారు.జల్సాలకు అలవాటు పడిన శివ విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో…
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. శ్రీ వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి…
యూరియా ఎక్కడ స్వామి.. రైతుల గోడు పట్టదా?
ఎరువుల కొరత, విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి ఆగ్రహం ఆర్మూర్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద, విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. వినాయక చవితి సందర్భంగా రైతులు తమ సమస్యలను తీర్చాలని గణపతిని వేడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ…..

