You Tube
You Tube Channel
ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్!
రూ.24 కోట్ల భవనంలో విద్యుత్ వైరింగ్ దగ్ధం.. ఊడిపడిన లైట్లు నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ టీఆర్ఎస్ నాయకుడు దాస్ ఆరోపణ ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య వల్లే అధిక వోల్టేజ్.. ఆసుపత్రి భవనాన్ని ఇంకా కాంట్రాక్టర్ అప్పగించలేదు – జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ వర్ని, నవంబర్ 17: (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించి ప్రారంభించిన ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్…
భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ గీతం
పటాన్చెరులో ఘనంగా అయ్యప్ప భక్తిగీతం ఆడియో విడుదల గురుస్వామి నర్రా బిక్షపతి, రమ సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయ్యప్ప భక్తుల మనసులను హత్తుకునేలా ఆర్ఆర్ టీం భక్తిగీతం భక్తి పాటలతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి: గురుస్వామి నర్రా బిక్షపతి పటాన్చెరు, నవంబర్ 9 (E6tv న్యూస్). అయ్యప్ప స్వామి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా రూపొందించిన ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ భక్తిగీతం ఆడియో విడుదల కార్యక్రమం పటాన్చెరులో ఘనంగా జరిగింది. పట్టణంలోని శాంతినగర్ అయ్యప్ప…
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణలో లోపాలపై అధికారులపై ఆగ్రహం కరీంనగర్, అక్టోబర్ 31 (E6tv న్యూస్). కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ అశ్విని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపిడి, గైనకాలజీ, అత్యవసర చికిత్స విభాగం, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గదులను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య…
కోరుట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సస్పెండ్
కోరుట్ల, అక్టోబర్ 31 (E6tv న్యూస్). విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా లోపాల కారణంగా జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31న జిల్లా కలెక్టర్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన,…
కొత్తపల్లిలో ఘనంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి పటాన్చెరు, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుమ్మడిదల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్తపల్లి…
వరంగల్‌లో E6TV ఎక్సలెన్స్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా కలెక్టర్
వరంగల్ హంటర్ రోడ్డులోని శ్రీ భద్రకాళి ఫంక్షన్ హాల్లో E6TV ఆధ్వర్యంలో ‘హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన జర్నలిస్టులు, సామాజిక సేవకులు, పారిశుధ్య కార్మికులు, కళాకారులు మరియు ట్రాన్స్జెండర్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం గొప్ప…
ఆర్మీ సైనికుడిపై దాడి కేసులో 14 మంది అరెస్ట్
14 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం మరింత మంది నిందితుల కోసం పోలీసుల గాలింపు మెట్పల్లి, అక్టోబర్ 24 (E6tv న్యూస్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో…
‘గ్రీన్ వాటర్’తో హైదరాబాద్‌లో నీటి కష్టాలకు చెక్..
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడంతో పాటు తాగునీటి వనరులపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ వాటర్) తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించేలా ‘గ్రీన్ వాటర్’ సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నగర శివారులోని కోకాపేటలో ప్రత్యేకంగా గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను జలమండలి పరిశీలించింది. నాణ్యత, పర్యవేక్షణపై…
పసుపు రైతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలను వివరించడంతో పాటు, పసుపు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా పసుపు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటికి తగిన…
ప్రయాణికులకు గుడ్‌న్యూస్: IRCTC బిగ్ అప్డేట్!
దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు 750కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని రైళ్ల సంఖ్యను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పండుగల వేళ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్టేషన్లలో ప్రత్యేక…
