అదిత్య-L1 డేటా విశ్లేషణకు శాస్త్రవేత్తలకు ISRO ఆహ్వానం.

భారతదేశ తొలి సౌర పరిశోధనా మిషన్ అదిత్య-L1 రెండో వార్షికోత్సవం సందర్భంగా, శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊపునిచ్చే కీలక ప్రకటన చేసింది ఇస్రో. అదిత్య-L1 మిషన్ ద్వారా సేకరించిన డేటా విశ్లేషణ కోసం భారతీయ శాస్త్రవేత్తల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ (AO) విడుదల చేసింది.
ప్రస్తుతం అదిత్య-L1 మిషన్‌కు సంబంధించి 23 టెరాబైట్లకు పైగా డేటా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉందని, ఇప్పటికే అనేక కీలక శాస్త్రీయ ఫలితాలు అంతర్జాతీయ పియర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని ఇస్రో తెలిపింది.
2023 సెప్టెంబర్ 2న ప్రయోగించిన అదిత్య-L1, 127 రోజుల ప్రయాణం తర్వాత 2024 జనవరి 6న సన్–ఎర్త్ L1 పాయింట్‌ను చేరుకుంది. అప్పటి నుంచి సూర్యుడిపై నిరంతర, సమగ్ర పరిశీలనలు చేస్తూ కీలక సమాచారం సేకరిస్తోంది.
ఈ తాజా AO సైకిల్‌తో సౌర భౌతిక శాస్త్ర పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని ఇస్రో స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *