ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాం

ఉద్యోగులకు గుర్తింపు నిబద్ధతతోనే: ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ : విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డ్ ఆఫీసర్లు తమ పే స్కేల్​ను సవరించి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రస్థాయి హడక్ కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *