రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు
రెండేళ్ల నిరీక్షణకు తెర.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పోరాటం ఫలితం
నిజామాబాద్, నవంబర్ 3:(E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు నవంబర్ 2న G.O.Rt.No.568 ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డిచ్పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్ఓబీ నిర్మాణానికి అదనపు నిధుల మంజూరు కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈ నిధుల మంజూరు కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించడంతో పాటు, ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను క్లియర్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ ఫైల్ ముందుకు కదలకపోవడంతో అక్టోబర్ 27న మాధవ్ నగర్ ఆర్ఓబీ వద్ద ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ స్వయంగా భిక్షాటన చేసి ప్రజలు, నాయకులు, వాహనదారుల నుంచి విరాళాలు సేకరించారు.అనంతరం అక్టోబర్ 29న హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి రూ.8.68 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అయినప్పటికీ ఫైల్ ముందుకు కదలకపోవడంతో అక్టోబర్ 27న మాధవ్ నగర్ ఆర్ఓబీ వద్ద ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ స్వయంగా భిక్షాటన చేసి ప్రజలు, నాయకులు, వాహనదారుల నుంచి విరాళాలు సేకరించారు.అనంతరం అక్టోబర్ 29న హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి రూ.8.68 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అక్టోబర్ 31న నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలోనూ మాధవ్ నగర్, అర్సపల్లి ఆర్ఓబీ పనుల పురోగతిని ఎంపీ సమీక్షించారు. నిర్మాణ పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేసి రానున్న నాలుగైదు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ క్రమంలో నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్!
మాధవ్ నగర్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ నగరంతో పాటు డిచ్పల్లి, పరిసర గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలగనుంది.ప్రభుత్వం నిధులకు సవరించిన అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఆర్ఓబీని పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.

