Breaking News

నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

ఎన్నికలకు సర్వం సిద్ధం.. 45 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలి.. అల్లర్లు సృష్టించే వారిపై పోలీసుల నిఘా అవసరం చెన్నేకొత్తపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్). చెన్నేకొత్తపల్లి మండలంలో నేడు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండల పరిధిలోని ఒక జడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక…

Read Full News

చిన్నపల్లి, ఎర్రంపల్లిలో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 31 (E6tv న్యూస్). చెన్నేకొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల ఎంపీటీసీ-1 స్థానం టీడీపీ అభ్యర్థి మాడెం సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థిని ఎం. శివలక్ష్మికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని చిన్నపల్లి, ఎస్టీ కాలనీ, ఎర్రంపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి మాడెం సూర్యనారాయణరెడ్డి,…

Read Full News

ఏపీలో పటాకుల షాపుల అనుమతులకు వాట్సాప్ సేవలు!

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వాట్సాప్ సేవను (నెంబర్: 9441236448) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ వివరాలు, షాపు అడ్రస్ సమర్పించగానే వాట్సాప్‌లోనే చెల్లింపు లింక్ వస్తుందని, రూ. 500 రుసుము యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించగానే రికమండేషన్ రిపోర్ట్ డౌన్‌లోడ్ అవుతుందని ఫైర్ సర్వీసెస్ డీజీ పి. వెంకటరమణ తెలిపారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆటోమేటెడ్…

Read Full News

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారగా, ఆదివారం నాటికి ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే…

Read Full News

ధర్మవరం మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

ఎన్నికల భద్రత కోసం 1,500 మంది పోలీసులతో ఏర్పాట్లు.. 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర నిఘా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ధర్మవరం, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). ధర్మవరం మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ తెలిపారు. నవంబర్ 1వ తేదీన…

Read Full News

సూపర్-6 హామీల అమలుతో ప్రజలకు సంక్షేమ ఫలాలు: టీడీపీ అభ్యర్థులు

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 27 నెలల్లో 90 శాతం హామీలు అమలు చేశామని వెల్లడి చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సుపరిపాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెన్నేకొత్తపల్లి ఎంపీటీసీ-1 అభ్యర్థి మాడెం సూర్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థిని ఎం. శివలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం (30-10-2026) శ్రీ…

Read Full News

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు

1,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు.. 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర నిఘా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. అల్లర్లు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పుట్టపర్తి, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నవంబర్ 1వ తేదీన పుట్టపర్తి, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర, ధర్మవరం…

Read Full News

చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరు

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 29: (E6tv NEWS). చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ-1 అభ్యర్థి ఎస్టీడీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి రెడ్డిమిగారి హేమలత సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

Read Full News

కోనసీమలో ‘అర్నబ్‌’ బీభత్సం: భారీగా పంట నష్టం

అర్నబ్ అతి తీవ్ర తుపాను ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలుల వల్ల భారీగా విధ్వంసం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 6,000 విద్యుత్ స్తంభాలు, వేలాది వృక్షాలు నేలకొరగడంతో అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా, రహదారులపై చెట్లు కూలి రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, అంబాజీపేట, పి.గన్నవరం తదితర మండలాల్లో…

Read Full News

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో పోలీసుల మొబైల్ ర్యాలీ

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్). మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ జగన్నాథ్ రాజు పర్యవేక్షణలో ధర్మవరం పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మొబైల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల…

Read Full News