Thirupathi
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు దగ్ధం
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం కురవపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారును అర్ధరాత్రి సమయంలో దుండగులు దగ్ధం చేశారు. నలుగురు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో వచ్చి, సీసీ కెమెరాలను పక్కకు తిప్పి మరీ కారుకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి అవినీతిని గతంలో వెలికి తీయడం వలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారని ప్రభాకర్ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో తమను భయభ్రాంతులకు…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు
ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…
తిరుపతిలో జనసేన నేతపై వైయస్సార్సీపీ దాడి
తిరుపతిలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ఘర్షణలు తారస్థాయికి చేరాయి. రుయా హాస్పిటల్ డైరెక్టర్, జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బండి లక్ష్మీపతి రాయల్ పై వైయస్సార్సీపీ శ్రేణులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఘటన వివరాలు: స్థానిక ఎన్నికల వేళ తిరుపతిలో ప్రత్యర్థి పార్టీ నేతపై జరిగిన ఈ హేయమైన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో జనసేన, కూటమి శ్రేణులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ లీగ్.. 30 జట్లు సిద్ధం!
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌కు కలర్ టీషర్టుల ఆవిష్కరణ అనంతపురం, అక్టోబర్ 15: (E6tv NEWS). ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్-2026కు సంబంధించి కలర్ టీషర్టుల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అనంతపురం నగరంలోని జిల్లా వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి టీషర్టులను ఆవిష్కరించి, టోర్నమెంట్లో పాల్గొనే జట్ల…
రూ.3,222 కోట్లతో తిరుపతికి కొత్త కళ..అభివృద్ధికి పచ్చజెండా!
తిరుపతి పుణ్యక్షేత్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ (తుడా) పరిధిలో మొత్తం రూ. 3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తిరుమల కొండపై రద్దీని తగ్గించేలా కొండ కిందనే రూ. 1,332 కోట్లతో 2,700 గదుల వసతి సముదాయం, రూ. 160 కోట్లతో 6 వేల మందికి ఒకేసారి భోజన సౌకర్యం కలిగించే అన్నప్రసాద కేంద్రం, పిలిగ్రిమ్…
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
మేయర్ ఎన్నికల్లో 35.29 శాతం రిజర్వేషన్లు – మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి అమరావతి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల శాతాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని…
ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…
నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?
కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…
దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ
చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు…

