Breaking News

ఏపీలో పటాకుల షాపుల అనుమతులకు వాట్సాప్ సేవలు!

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వాట్సాప్ సేవను (నెంబర్: 9441236448) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ వివరాలు, షాపు అడ్రస్ సమర్పించగానే వాట్సాప్‌లోనే చెల్లింపు లింక్ వస్తుందని, రూ. 500 రుసుము యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించగానే రికమండేషన్ రిపోర్ట్ డౌన్‌లోడ్ అవుతుందని ఫైర్ సర్వీసెస్ డీజీ పి. వెంకటరమణ తెలిపారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆటోమేటెడ్…

Read Full News

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారగా, ఆదివారం నాటికి ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే…

Read Full News

అర్నాబ్ తుపాను నష్టంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ!

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన ఈ విపత్తులో తక్షణమే క్షేత్రస్థాయిలో నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను నివారణ మరియు సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సవివర నివేదికను త్వరలోనే సమర్పిస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,900…

Read Full News

విజయవాడ 75వ డివిజన్: త్రివేణి రెడ్డి విస్తృత ప్రచారం!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 75వ డివిజన్‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పేరం త్రివేణి రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తన ముఖ్య ధ్యేయమని, స్థానిక డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. విద్యావంతురాలిగా, రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తిగా డివిజన్‌లోని మౌలిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తనకు పూర్తి స్పష్టత ఉందాని త్రివేణి రెడ్డి తెలిపారు. స్థానికులతో మమేకమవుతూ…

Read Full News

విజయవాడ 44వ డివిజన్: జోగేశ్వరరావు విస్తృత ప్రచారం!

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్‌లో కూటమి తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బెవర జోగేశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బుద్ధ వెంకన్నలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డివిజన్‌లోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తాగునీటి ఎద్దడి నివారణ,…

Read Full News

రెబల్స్ నామినేషన్లపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేశారు. కూటమి పొత్తులో భాగంగా పార్టీ అధికారికంగా బీఫామ్ జారీ చేసినవారే అభ్యర్థులని, మిగిలిన వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకొని కూటమి స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబుతో చర్చించి సీట్ల సర్దుబాటును విజయవంతంగా పూర్తి చేశామని, పార్టీ కోసం త్యాగం చేసిన వారికి భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్నబ్…

Read Full News

ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా త్రివేణి ప్రచారం

చైర్మన్ అభ్యర్థి పరిశే సుధాకర్‌కు సైకిల్ గుర్తుపై ఓటేయండి 6, 11వ వార్డుల బీజేపీ అభ్యర్థులను కమలం గుర్తుపై గెలిపించండి ధర్మవరం, అక్టోబర్ 24:(E6tv NEWS). ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి వారి మద్దతు కోరారు. ధర్మవరం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున పోటీ…

Read Full News

విజయవాడలో ఓటర్లను ఆకట్టుకుంటున్న వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి!

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి 19, 20, 21 డివిజన్లలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కార్పొరేటర్ అభ్యర్థి శెట్టి కందుర్గాప్రసాద్‌తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. గతంలో వైసీపీ పాలనలోనే విజయవాడ నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, తాను మేయర్‌గా చేపట్టిన అభివృద్ధి పనులే తనకు శ్రీరామరక్ష అని…

Read Full News

టీడీపీ vs వైసీపీ..పరిషత్ పోరులో భారీగా నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్సాహంగా ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. కేవలం చివరి రోజునే అత్యధికంగా జెడ్పీటీసీలకు 3,315, ఎంపీటీసీలకు 25,016 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. నామినేషన్ల దాఖలులో అధికార తెలుగుదేశం…

Read Full News

కోటియాలో పంచాయతీ ఎన్నికలు.. సుప్రీంకోర్టులో ఒడిశా పిటిషన్!

వివాదాస్పద కోటియా ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్ దాఖలు చేసింది. ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి శనివారం ఈ వివరాలను వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలోని కోటియా క్లస్టర్ గ్రామాల్లో జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదంతో…

Read Full News