Nellore
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
నెల్లూరులో ఉద్రిక్తత మైనారిటీ నేత అరెస్ట్..!
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేత అబ్దుల్ మస్తాన్ అరెస్టయిన నేపథ్యంలో, ఆ పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోటమిట్టలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మైనారిటీ నేతలతో కలిసి నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన, మస్తాన్ ఆచూకీపై పోలీసులను వివరాలు కోరారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని, ఆందోళన చెందవద్దని పోలీసులు హామీ…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు
ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…
నామినేషన్ల వేళ ఉద్రిక్తత:వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రాళ్ల దాడి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. రాయచోటిలో కొందరు ఆగంతకులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకుని దాడికి పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ…
ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…
ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ లీగ్.. 30 జట్లు సిద్ధం!
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌కు కలర్ టీషర్టుల ఆవిష్కరణ అనంతపురం, అక్టోబర్ 15: (E6tv NEWS). ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్-2026కు సంబంధించి కలర్ టీషర్టుల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అనంతపురం నగరంలోని జిల్లా వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి టీషర్టులను ఆవిష్కరించి, టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల…
జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు సకాలంలో బ్యాంకు రుణాల పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో సోమవారం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో…
చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…
పుట్టపర్తిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ పుట్టపర్తి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సచివాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…
ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!
తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…

