West Godhavari
ఏపీలో పటాకుల షాపుల అనుమతులకు వాట్సాప్ సేవలు!
దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వాట్సాప్ సేవను (నెంబర్: 9441236448) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ వివరాలు, షాపు అడ్రస్ సమర్పించగానే వాట్సాప్‌లోనే చెల్లింపు లింక్ వస్తుందని, రూ. 500 రుసుము యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించగానే రికమండేషన్ రిపోర్ట్ డౌన్‌లోడ్ అవుతుందని ఫైర్ సర్వీసెస్ డీజీ పి. వెంకటరమణ తెలిపారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆటోమేటెడ్…
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారగా, ఆదివారం నాటికి ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే…
పెళ్లికి అడ్డొస్తుందని దారుణం.. ఏలూరు జిల్లాలో ప్రియురాలి హత్య!
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రావులపర్రులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో 41 ఏళ్ల సంధ్యారాణి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ అజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రావులపర్రుకు చెందిన సంధ్యారాణి, డ్రైవర్ అజయ్ మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అజయ్‌కు వేరే మహిళతో వివాహం నిశ్చయం కావడంతో సంధ్యారాణిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీనిపై ఇద్దరి…
అర్ణబ్ తుపాను ఎఫెక్ట్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘అర్ణబ్’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుపాను కారణంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు కీలక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, చర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి కోస్తాంధ్ర, ఒడిశా వైపు వెళ్లే హౌరా, భువనేశ్వర్, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా,…
ఏపీకి ‘అర్ణాబ్’ తుపాను ముప్పు: కోస్తా తీరానికి హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణాబ్’ తుపాను తీవ్రంగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. రానున్న 12 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా బలపడి, బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించాయి. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 115 నుండి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు విస్తారంగా అత్యంత…
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్!
సీఐ, ఎస్‌ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS). స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్‌చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆరోపణల…
బయ్యన్నగూడెంలో ఇంట్లోనే కుటుంబం ఉండగా ఇల్లు కూల్చివేత
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే తమ ఇంటిని కూల్చివేశారంటూ ఎడ్లపల్లి సోమరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పుల జాన్ అనే వ్యక్తి తమ ఇంటిని కూల్చివేయడమే , ఇంట్లోని గృహోపకరణాలను సైతం ట్రాక్టర్‌పై తరలించుకుపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, బాధితుల ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ…
ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా…
అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం
25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…
- 1
- 2
