Breaking News

ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా త్రివేణి ప్రచారం

చైర్మన్ అభ్యర్థి పరిశే సుధాకర్‌కు సైకిల్ గుర్తుపై ఓటేయండి 6, 11వ వార్డుల బీజేపీ అభ్యర్థులను కమలం గుర్తుపై గెలిపించండి ధర్మవరం, అక్టోబర్ 24:(E6tv NEWS). ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి వారి మద్దతు కోరారు. ధర్మవరం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున పోటీ…

Read More

కుప్పం టీడీపీలో రచ్చ.. సీనియర్ నేతల తీవ్ర అసహనం!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం టీడీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గుడుపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన కీలక నాయకులు, మహిళా నేతలు అభ్యర్థుల కేటాయింపులపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీ కోసం కేసులు ఎదుర్కొని నిలబడిన పాత నాయకులను…

Read More

కుప్పంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్లు.. 507 దాఖలు!

కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 507 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించారు. పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి అత్యధికంగా 293 నామినేషన్లు నమోదవ్వగా, వైఎస్సార్‌సీపీ తరఫున 178 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే జనసేన పార్టీ నుంచి 17, బీజేపీ తరఫున 10, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 9 నామినేషన్లు సమర్పించారు. మండలాల వారీగా…

Read More

ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…

Read More

చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్‌!

సీఐ, ఎస్‌ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS). స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్‌చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆరోపణల…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు

ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…

Read More

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు…

Read More

రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ అరెస్ట్… పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య వరుసగా రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక కారు ధ్వంసం కాగా, వైఎస్సార్‌సీపీ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లను రప్పించి గొడవలను తీవ్రతరం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు పంజాబ్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి…

Read More

నామినేషన్ల వేళ ఉద్రిక్తత:వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రాళ్ల దాడి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. రాయచోటిలో కొందరు ఆగంతకులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకుని దాడికి పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ…

Read More

ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…

Read More