Andhra Pradesh
ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా త్రివేణి ప్రచారం
చైర్మన్ అభ్యర్థి పరిశే సుధాకర్‌కు సైకిల్ గుర్తుపై ఓటేయండి 6, 11వ వార్డుల బీజేపీ అభ్యర్థులను కమలం గుర్తుపై గెలిపించండి ధర్మవరం, అక్టోబర్ 24:(E6tv NEWS). ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి వారి మద్దతు కోరారు. ధర్మవరం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున పోటీ…
విజయవాడలో ఓటర్లను ఆకట్టుకుంటున్న వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి!
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి 19, 20, 21 డివిజన్లలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కార్పొరేటర్ అభ్యర్థి శెట్టి కందుర్గాప్రసాద్తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. గతంలో వైసీపీ పాలనలోనే విజయవాడ నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, తాను మేయర్‌గా చేపట్టిన అభివృద్ధి పనులే తనకు శ్రీరామరక్ష అని…
నరసరావుపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ప్రజల్లో భరోసా!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి పర్యవేక్షణలో నరసరావుపేట పట్టణంలో పోలీసులు గురువారం ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ మల్లమ్మ సెంటర్ మీదుగా సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్ వరకు సాగింది. ఈ కవాతులో…
దాచేపల్లిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం!
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే నామినేషన్ కేంద్రాలను మార్చివేస్తూ తమ పార్టీ అభ్యర్థులను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకోవడంతో పాటు, పలువురిపై అక్రమ కేసులు…
చీరాల అభివృద్ధి నాదే బాధ్యత.. ఎమ్మెల్యే మాలకొండయ్య హామీ!
బాపట్ల జిల్లా చీరాల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని మాట్లాడారు. చీరాల పట్టణ సమగ్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత చరిత్రను పరిశీలిస్తే టీడీపీ హయాంలోనే పట్టణాభివృద్ధికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా చీరాల మున్సిపాలిటీలో టీడీపీ చైర్మన్‌ను గెలిపించుకోబోతున్నామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు నమ్మకంతో టీడీపీ…
కుప్పం టీడీపీలో రచ్చ.. సీనియర్ నేతల తీవ్ర అసహనం!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం టీడీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గుడుపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన కీలక నాయకులు, మహిళా నేతలు అభ్యర్థుల కేటాయింపులపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీ కోసం కేసులు ఎదుర్కొని నిలబడిన పాత నాయకులను…
టీడీపీ vs వైసీపీ..పరిషత్ పోరులో భారీగా నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్సాహంగా ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. కేవలం చివరి రోజునే అత్యధికంగా జెడ్పీటీసీలకు 3,315, ఎంపీటీసీలకు 25,016 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. నామినేషన్ల దాఖలులో అధికార తెలుగుదేశం…
కోటియాలో పంచాయతీ ఎన్నికలు.. సుప్రీంకోర్టులో ఒడిశా పిటిషన్!
వివాదాస్పద కోటియా ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్ దాఖలు చేసింది. ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి శనివారం ఈ వివరాలను వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలోని కోటియా క్లస్టర్ గ్రామాల్లో జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదంతో…
వైసీపీ నేతల తీరుపై అదనపు డీఎస్పీ సంచలన కామెంట్స్!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. నామినేషన్ల దాఖలులో పోలీసు యంత్రాంగం సహకరించడం లేదంటూ వైఎస్సార్సీపీ (వైసీపీ) చేస్తున్న ఆరోపణలను అదనపు డీఎస్పీ హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని స్పష్టం చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థులు ముందుకు రాలేదు. చివరి రోజు…
కుప్పంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్లు.. 507 దాఖలు!
కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 507 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించారు. పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి అత్యధికంగా 293 నామినేషన్లు నమోదవ్వగా, వైఎస్సార్సీపీ తరఫున 178 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే జనసేన పార్టీ నుంచి 17, బీజేపీ తరఫున 10, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 9 నామినేషన్లు సమర్పించారు. మండలాల వారీగా…

