Breaking News

ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…

Read More

టీడీపీకి షాక్: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు భారీ సంఖ్యలో అనుచరులు, శ్రేణులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీపై తీవ్ర ఆవేదన, సంచలన ఆరోపణలు: కూటమి పాలనలో ప్రజలు…

Read More

ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…

Read More

విజయనగరం జడ్పీ రేసులో బొత్స కూతురు అనూష..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ విజయనగరం జిల్లా రాజకీయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె, భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అయిన డాక్టర్ బొత్స అనూషను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా బొత్స కుటుంబం…

Read More

జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు సకాలంలో బ్యాంకు రుణాల పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో సోమవారం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో…

Read More

ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ…

Read More

దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ

చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు…

Read More

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

సమాన పనికి సమాన వేతనం అందించాలి: సాకే హరి అనంతపురం, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందేలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read More

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…

Read More