Ongole
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…
నంద్యాల పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు.. వైరల్ వీడియోపై చర్చ
పోలీస్ స్టేషన్ ఆవరణలో బాణసంచా కాల్చినట్లు ప్రచారం.. పోలీసు అధికారితో కేక్ కటింగ్‌పై విమర్శలు నంద్యాల, అక్టోబర్10:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాణసంచా కాల్చినట్లు,…
ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ…
నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?
కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…
రాయలసీమ నిధులపై రోజా ఫైర్..సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. “కరవు, చంద్రబాబు కవల పిల్లలు” అని వ్యాఖ్యానించిన ఆమె, రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.24,000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న మాటల్లో నిజం లేదని, ఆ నిధులు ఎక్కడ వెచ్చించారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రకటించాలని,…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం
‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…
శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…
ఏపీకి వెదర్ అలర్ట్! వచ్చే 72 గంటల్లో వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మళ్లీ మారబోతోంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాగల మూడు రోజుల పాటు (నెక్స్ట్ 72 అవర్స్) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాంతాల వారీగా…
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి) చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సవిత విద్యార్థినులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఎం.జె.పి. బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, ఇతర సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్న తీరును స్వయంగా వీక్షించారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన మంత్రి.. వారి…
- 1
- 2

