ఒక్క పత్రికకే గుర్తింపా..? మిగతా విలేకరుల కష్టానికి విలువ లేదా..!
మెట్పల్లి బస్టాండ్ ఘటనపై స్థానికంగా చర్చ.. ప్రజా సమస్యలపై స్పందనలో సమానత్వం ఎక్కడ? మెట్పల్లి, అక్టోబర్ 26 (E6 TV న్యూస్). ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తోందా? ఒక పత్రికలో వార్త ప్రచురితమైతేనే ప్రజాప్రతినిధులు స్పందిస్తారా? ఇతర పత్రికల్లో వచ్చిన కథనాలకు ప్రాధాన్యత లేదా? ప్రస్తుతం మెట్పల్లి పట్టణ బస్టాండ్లో పారిశుద్ధ్య సమస్యపై చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరుల పాత్ర…

