Karnool
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో పోలీసుల మొబైల్ ర్యాలీ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్). మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ జగన్నాథ్ రాజు పర్యవేక్షణలో ధర్మవరం పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మొబైల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల…
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్!
సీఐ, ఎస్ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS). స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆరోపణల…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు
ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు…
రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ అరెస్ట్… పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వరుసగా రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక కారు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లను రప్పించి గొడవలను తీవ్రతరం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు పంజాబ్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి…
ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…
ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ లీగ్.. 30 జట్లు సిద్ధం!
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌కు కలర్ టీషర్టుల ఆవిష్కరణ అనంతపురం, అక్టోబర్ 15: (E6tv NEWS). ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్-2026కు సంబంధించి కలర్ టీషర్టుల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అనంతపురం నగరంలోని జిల్లా వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి టీషర్టులను ఆవిష్కరించి, టోర్నమెంట్లో పాల్గొనే జట్ల…
జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు సకాలంలో బ్యాంకు రుణాల పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో సోమవారం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో…
చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…

