Krishna
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్!
సీఐ, ఎస్ఐ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 22: (E6tv NEWS). స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులపై చెన్నేకొత్తపల్లి ఇన్చార్జి సీఐ ఇస్మాయిల్, ఎస్ఐ సత్యనారాయణ లాఠీలతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాలకు దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఆరోపణల…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు
ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు…
ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…
ఐపీఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ లీగ్.. 30 జట్లు సిద్ధం!
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్‌కు కలర్ టీషర్టుల ఆవిష్కరణ అనంతపురం, అక్టోబర్ 15: (E6tv NEWS). ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ లీగ్-2026కు సంబంధించి కలర్ టీషర్టుల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అనంతపురం నగరంలోని జిల్లా వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ వెటర్న్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి టీషర్టులను ఆవిష్కరించి, టోర్నమెంట్లో పాల్గొనే జట్ల…
పుట్టపర్తిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ పుట్టపర్తి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సచివాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…
ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…
ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ…
నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?
కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…
- 1
- 2

