Breaking News

లేట్ నైట్ సౌండ్ పొల్యూషన్: పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్!

సినీ నటుడు అల్లు శిరీష్ తన నివాస ప్రాంతంలో అర్ధరాత్రి వేళ వినిపిస్తున్న తీవ్రమైన శబ్ద కాలుష్యంపై హైదరాబాద్ సిటీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా ఆశ్రయించారు. షేక్‌పేట్‌లోని ‘అపర్ణ వన్’ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆయన, సమీపంలోని వినోబా నగర్ హనుమాన్ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు మైకులు, పాటలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వినాయక నిమజ్జన వేడుకల కారణంగా సెప్టెంబర్ 25 వరకు ఓపిక పట్టాలని ఫిల్మ్‌నగర్ పోలీసులు తెలిపారని, అయితే పండుగ ముగిసినప్పటికీ ఈ శబ్దాలు ఆగడం లేదని అల్లు శిరీష్ పేర్కొన్నారు. ఈ శబ్దాల వల్ల తమ కమ్యూనిటీలోని చిన్నపిల్లలు, వృద్ధులు మరియు ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తన విండో నుంచి తీసిన ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. శిరీష్ ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు, ఈ విషయాన్ని ఫిల్మ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *