Breaking News

మూడు డివిజన్ల ప్రజల సౌకర్యార్థం పీహెచ్‌సీ, మహిళా భవనం నిర్మించాలి

మహిళల వినతికి సానుకూలంగా స్పందించిన 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్

నిజామాబాద్, నవంబర్ 3 (E6tv న్యూస్).

నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి, నాందేవ్‌వాడ, సుభాష్‌నగర్ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం హమాల్వాడి చౌరస్తాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), మహిళా భవనం నిర్మించాలని కోరుతూ ఆయా ప్రాంతాలకు చెందిన మహిళలు 35వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు.

సోమవారం నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన మహిళా ప్రతినిధులతో సమావేశమైన ఎర్రం సుధీర్‌కు మహిళలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా మూడు డివిజన్లలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా హమాల్వాడి చౌరస్తాలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని, మహిళలకు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా మహిళా భవనం నిర్మించాలని కోరారు.

మహిళల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ ఎర్రం సుధీర్, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే ఈ రెండు నిర్మాణాలకు మంజూరు తీసుకువచ్చి పనులు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడంలో ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, అన్ని డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *