Breaking News

ఏపీలో పటాకుల షాపుల అనుమతులకు వాట్సాప్ సేవలు!

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వాట్సాప్ సేవను (నెంబర్: 9441236448) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ వివరాలు, షాపు అడ్రస్ సమర్పించగానే వాట్సాప్‌లోనే చెల్లింపు లింక్ వస్తుందని, రూ. 500 రుసుము యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించగానే రికమండేషన్ రిపోర్ట్ డౌన్‌లోడ్ అవుతుందని ఫైర్ సర్వీసెస్ డీజీ పి. వెంకటరమణ తెలిపారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల అగ్నిమాపక కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభంగా, పారదర్శకంగా అనుమతులు పొందవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *