Breaking News

కళాకారులకు ప్రాధాన్యం ‘కామన్ ఫెసిలిటీ సెంటర్లు’ ఏర్పాటు : పవన్ కళ్యాణ్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ చేతివృత్తులు, కళాకారుల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్స్ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొని కళాకారులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన, వారి ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సౌకర్యాల కోసం క్లస్టర్లవారీగా ‘కామన్ ఫెసిలిటీ సెంటర్లు’ (CFCs) అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

క్లస్టర్లవారీగా CFCల అభివృద్ధి వివరాలు

  • సీతంపేట (పార్వతీపురం మన్యం): సవర గిరిజన కళాకారుల ప్రోత్సాహార్థం ‘VB-G RAM-G’ పథకం నిధులతో సీతంపేట వద్ద భూసేకరణ పూర్తిచేసి సీఎఫ్‌సీ (CFC) నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
  • మదనేపల్లె (అన్నమయ్య జిల్లా): బంజారా బ్యాగ్ తయారీదారుల కోసం భూమి సేకరణ పూర్తయింది.
  • కురుగుంట (అనంతపురం): అరటి నార (Banana Fibre) ఉత్పత్తుల కళాకారులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
  • పెదన (కృష్ణా జిల్లా): ప్రసిద్ధ కలంకారీ కళాకారుల కోసం భూమిని గుర్తించారు, అనుమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయి.
  • ఉదయగిరి (నెల్లూరు): సాంప్రదాయ చెక్క పాత్రల తయారీదారుల కమ్యూనిటీ సెంటర్ మరమ్మతుల కోసం ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుంచి ₹12 లక్షలు కేటాయించారు.

ఇతర కీలక సంక్షేమ చర్యలు

గ్లోబల్ మార్కెట్ అనుసంధానం: హస్తకళల ఉత్పత్తులపై కళాకారుల వివరాలు, వారి నైపుణ్యాన్ని గు గుర్తించేందుకు ‘QR కోడ్‌లు’ అందుబాటులోకి తెస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీనిద్వారా స్థానిక కళాకారులకు గ్లోబల్ మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయి.

  • ఏటికొప్పాక హెల్త్ సెంటర్: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని (Health Centre) వెంటనే పునఃప్రారంభించాలని ఆదేశించారు.
  • ఉచిత కంటి వైద్య శిబిరాలు: కళాకారుల కోసం నిర్వహించిన 6 ఉచిత కంటి వైద్య శిబిరాల్లో 1,708 మందికి పరీక్షలు చేసి, 93 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు నిర్వహించామని, 1,253 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *