వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో ఉన్న చెరబండ రాజు కాలనీలో అర్ధరాత్రి వేళ గుడిసెల తొలగింపు చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాల పహారా మధ్య అధికారులు కూల్చివేతలకు దిగడంతో, తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానిక నిరుపేదలు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్‌తో పాటు పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగి, ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు.
వరంగల్‌లో గుడిసెల కూల్చివేత..అర్ధరాత్రి పోలీసులను నిలదీసిన పేదలు
