ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన ఎలక్షన్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఉపఎన్నిక నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టులో ప్రమాణపత్రం (అఫిడవిట్) దాఖలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాలు చేస్తూ పి. విజయారెడ్డి వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నందున ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఆమె కోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఎన్నికల ప్రామాణికతపై పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఉపఎన్నికలు నిలిపివేయాల్సి ఉంటుందని ఈసీఐ కోర్టుకు స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీఐ కీలక అఫిడవిట్
