Breaking News

ఏపీ మున్సిపల్ ఎన్నికలు…మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల సీట్లు ఎవరికి?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్థానాలు ఎస్టీలకు, రాజమండ్రి-కర్నూలు స్థానాలు ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉండగా, నెల్లూరును జనరల్ కోటాలో చేర్చే ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలతో పాటు సుమారు 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిజర్వేషన్ల జాబితా ఇవాళ మధ్యాహ్నానికి వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *