Breaking News

ప్రియుడిని విడిపించే ప్రయత్నంలో జైలుపాలైన యువతి!

జైలులో ఉన్న ప్రియుడికి బెయిల్ ఇప్పించే డబ్బుల కోసం ఓ యువతి డ్రగ్స్ క్యారియర్‌గా మారి పోలీసులకు చిక్కింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో బెంగళూరు నుంచి తీసుకొస్తున్న 110 గ్రాముల ఎండీఎంఏతో నాగసౌమ్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్య ప్రియుడు కాశీవర్ధన్ డ్రగ్స్ కేసులో చిత్తూరు జైలులో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం డబ్బు కావాల్సి ఉండటంతో.. కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్ మాటలకు ఆమె ఆశపడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెస్తే రూ. 50 వేల కమిషన్ ఇస్తానని బషీర్ చెప్పడంతో ఆమె ఈ అడుగు వేసింది. బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సేకరించి రైలులో విజయవాడ వస్తుండగా.. ముందస్తు సమాచారం అందుకున్న జీఆర్పీ, ఈగల్ పోలీసులు రైల్వే స్టేషన్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బషీర్‌ను కూడా పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *