Breaking News

పీజేఆర్ స్టేడియం క్రీడాకారులకు కనీస వసతులు కల్పించాలి:మూగల రఘునందన్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మూగల రఘునందన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి అధికారులకు స్వాగతం పలికారు.

స్టేడియం అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా స్టేడియంలో వాకర్స్, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బట్లు, కనీస మౌలిక వసతుల కొరతపై కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రఘునందన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్, సామల్ కార్తీక్, శ్రీహరి, సాయి కిషోర్ ముదిరాజ్, అంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *