Breaking News

ఎల్లారెడ్డి యువకుడికి జాతీయ స్థాయి బాధ్యత!

ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి నియామకం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 23: (E6tv NEWS).

ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన యువకుడు నాగరం రణదీప్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మిసన్‌పల్లికి చెందిన రణదీప్ రెడ్డి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం (AILSF) 2027–2028 నూతన కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాగరం నరసింహ రెడ్డి కుమారుడైన రణదీప్ రెడ్డి హైదరాబాద్‌లో బీఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌ఎల్‌బీ అభ్యసిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

గతంలో ప్రభుత్వ సిటీ కళాశాలలో బీవీపీ జాయింట్ సెక్రటరీగా, చార్మినార్ జోనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. నూతన బాధ్యతలతో విద్యార్థుల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, యువతను సామాజిక సేవతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు రణదీప్ రెడ్డి తెలిపారు.

ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన యువకుడికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడంపై స్థానికులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *