సతెళ్లి దర్గా సమీపంలో చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం
యెల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్)
కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సతెళ్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలు (21) అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో యెల్లారెడ్డి నుంచి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన సతెళ్లికి బయలుదేరాడు.
ఈ క్రమంలో సతెళ్లి దర్గా సమీపానికి చేరుకోగానే అదుపుతప్పిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిలుకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు.మృతుడి అక్క నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యెల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
