Breaking News

బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష

పోక్సో కేసులో ఏడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా

నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్).

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబర్‌లో నిజామాబాద్‌లోని ఒక ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై మాచా రవీంద్రనాథ్ అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు క్రైం నంబర్ 236/2021గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354-D కింద నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించగా, పోక్సో చట్టంలోని సెక్షన్ 9 కింద ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మరో రూ.10 వేల జరిమానా విధించినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *