పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 (E6tv NEWS).
నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా నూతన పదాధికారులు, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులకు, కార్యవర్గ సభ్యులకు నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

